‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!

‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!

Published on Aug 26, 2025 12:00 PM IST

Mirai Movie

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా హను మాన్ సక్సెస్ తర్వాత నటిస్తున్న మరో సూపర్ హీరో చిత్రమే “మిరాయ్”. ఈగల్ సినిమాతో సత్తా చాటిన టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా పట్ల కూడా ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ఎట్టకేలకి రిలీజ్ కి దగ్గరకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ఫైనల్ గా మేకర్స్ డేట్ లాక్ చేశారు.

దీనితో ఈ ఆగస్ట్ 28న ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనిపై ఓ సాలిడ్ పోస్టర్ ని కూడా రెడీ చేయగా ఇందులో తేజ వర్సెస్ మంచు మనోజ్ యాక్షన్ చూడవచ్చు. ఇక ఇదే పోస్టర్ తో మేకర్స్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు. ఇది వరకు సెప్టెంబర్ 5 డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేయగా ఇపుడు సెప్టెంబర్ 12న గ్రాండ్ గా పాన్ వరల్డ్ లెవెల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ఎలా అలరిస్తుందో చూడాలి.

తాజా వార్తలు