లేటెస్ట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన యానిమేషన్ చిత్రమే “మహావతార్ నరసింహ”. కనీసం డబ్బింగ్ కోసం కూడా స్టార్స్ లాంటి వారిని తీసుకోకుండా విడుదల చేసిన ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టించింది. ఇలా ఇండియా వైడ్ గా భారీ రెస్పాన్స్ ని కొనసాగిస్తున్న తర్వాత లేట్ గానే యూఎస్ మార్కెట్ లో విడుదల అయినప్పటికీ అక్కడ కూడా భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది.
లేటెస్ట్ గా ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి నెక్స్ట్ స్టాప్ గా 2 మిలియన్ మార్క్ ని అందుకునే దిశగా వెళుతుంది. మరి ఈ మార్క్ కూడా అందుకుంటే ఇండియన్ సినిమా నుంచి 2 మిలియన్ క్లబ్ ఓపెన్ చేసిన మొదటి యానిమేషన్ సినిమాగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. అలాగే క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.