గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!

గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!

Published on Aug 26, 2025 7:04 AM IST

Allu Arjun, Atlee

పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ మార్కెట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ పై కన్నేశాడు. అందుకు తగ్గట్టే దర్శకుడు అట్లీతో అనౌన్స్ చేసిన సినిమా ఫస్ట్ బాల్ తోనే సిక్సర్ కొట్టి దుమ్ము లేపాడు. ఇక ఇక్కడ నుంచి హాలీవుడ్ లెవెల్ స్టఫ్ తో మాత్రమే ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడొక గ్లోబల్ ఫినామినా గా మారుతుంది అని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం హాలీవుడ్ లో అవతార్, డ్యూన్, జూరాసిక్ వరల్డ్ లాంటి భారీ సినిమాలకి పని చేసిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అలెగ్జాండ్రా ఏవిస్కోనిటీ ఇప్పుడు ఈ భారీ సినిమా కోసం వర్క్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనితో అట్లీ ప్లానింగ్ విషయంలో మాత్రం అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ మున్ముందు ఇంకెంత సర్ప్రైజ్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు