‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్‌లో డార్లింగ్ బిజీ!

‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్‌లో డార్లింగ్ బిజీ!

Published on Aug 25, 2025 6:02 PM IST

The-Raa-Saab-Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో హార్రర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ను తెరకెక్కిస్తున్న ప్రభాస్, మరో డైరెక్టర్ హను రాఘవపూడితో పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఫౌజీ’ని కూడా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాల్లో ది రాజా సాబ్ షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ను నేడు(ఆగస్టు 25) హైదరాబాద్‌లోని అజీజ్ నగర్‌లో తిరిగి ప్రారంభించారని.. ఇందులో ప్రభాస్ కూడా పాల్గొంటున్నాడని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి కేరళలో ప్రభాస్ ఇంట్రొడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తారని.. ఆ తర్వాత మేకర్స్ గ్రీస్ దేశానికి వెళ్లి అక్కడ మరో రెండు పాటలు షూట్ చేస్తారని తెలుస్తోంది. దీంతో ఈ చిత్ర షూటింగ్ వర్క్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు