‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !

‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !

Published on Aug 24, 2025 11:59 AM IST

Suriya 46

తమిళ స్టార్ హీరో సూర్య – వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. కాగా తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలు పెట్టనున్నారని.. అందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్ వేస్తునట్లు తెలుస్తోంది. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో సూర్య చేస్తున్న రోల్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయట.

అన్నట్టు ఇప్పటికే, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్ నడిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు