విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!

విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!

Published on Aug 22, 2025 9:00 AM IST

vishwambhara

మన తెలుగు సినిమా దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కూడా ఒకటి. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా వచ్చిన బర్త్ డే బ్లాస్ట్ టీజర్ ఇపుడు అదరగొడుతుంది.

అయితే గత ఏడాది దసరా కానుకగా వచ్చిన గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుందో అందరికీ తెలిసిందే. పైగా అక్కడ నుంచి సినిమా మరింత ఆలస్యం కావడంతో అభిమానుల్లో కొద్దిపాటి టెన్షన్ కూడా లేకపోలేదు. ఇలా అక్కడ నుంచి తగ్గిన అంచనాలు అలాగే ఆశలు నిన్న బర్త్ డే టీజర్ తో మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చాయని చెప్పడంలో సందేహం లేదు.

ఎక్కడా కూడా విజువల్స్ పరంగా గతంలో వచ్చినట్టు నెగిటివ్ రిమార్క్ ఎవరి నుంచీ కనిపించడం లేదు. అలాగే సాలిడ్ క్వాలిటీ చూపించిన మేకర్స్ వచ్చే ఏడాది వేసవి ట్రీట్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెప్పవచ్చు. సో విశ్వంభర పట్ల ప్రస్తుతం మంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.

తాజా వార్తలు