మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఒక సరైన హిట్ కొడితే దాని తాలూకా లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూపించిన చిత్రమే “వాల్తేరు వీరయ్య”. తన అభిమాని, దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యి అదరగొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కలయికలో సినిమా ఓకే అయ్యిన సంగతి తెలిసిందే.
అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై మరో క్రేజీ న్యూస్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం మెగాస్టార్ ని పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా బాబీ ప్రెజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. డాకు మహారాజ్ ని మించిన సాలిడ్ ఎలివేషన్స్ ఈ పాత్రకి తాను డిజైన్ చేసుకున్నాడట. సో మొత్తానికి ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ చిత్రాన్ని మెగాస్టార్ నుంచి చూసే ఛాన్స్ ఉందని ఇప్పుడు చెప్పవచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.