సిద్దార్థ్ సినిమాలో మెరవనున్న సమంత

సిద్దార్థ్ సినిమాలో మెరవనున్న సమంత

Published on Jun 12, 2013 3:10 PM IST

samantha-siddharth

సిద్దార్థ్, సమంతల మద్య ఏదో నడుస్తోందన్నది అందరికి తేలిన విషయమే. ఈ గ్లామరస్ యంగ్ హీరోయిన్ సిద్దార్థ్ నటించిన ‘సమ్థింగ్ సమ్థింగ్’ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి సుందర్. సి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సమంత, టాలీవుడ్ హంక్ రానా దగ్గుపాటి లు అతిధి పాత్రలలో కనిపించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దార్థ్ సరసన హన్సిక హీరోయిన్ గా నటించింది. బ్రహ్మనందం ఈ సినిమాలో లవ్ గురుగా కనిపించనున్నాడు. ఈ సినిమా ఈ శుక్రవారం రోజు విడుదలకానుంది. సమంత అతిధి పాత్ర చేయడం వల్ల సిద్దార్థ్ అదృష్టం మారనుందా? తెలియాలంటే ఇంకో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు