‘ది ప్యారడైజ్’లో నాని సర్‌ప్రైజ్.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!

‘ది ప్యారడైజ్’లో నాని సర్‌ప్రైజ్.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!

Published on Aug 18, 2025 6:00 PM IST

The-Paradise

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అప్పుడే ఈ సినిమాపై అభిమానుల్లో అదిరిపోయే ఆసక్తి రేపుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని లుక్ పరంగా ఎలా కనిపిస్తాడో ఇప్పటికే రివీల్ చేశారు. అయితే, ఈ సినిమాలో నాని మొత్తం మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడని.. అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఒకటి అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుందని చిత్ర వర్గాల టాక్.

గతంలోనూ నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడు. ఇప్పుడు మరోసారి నాని అలాంటి పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తుండటంతో ఇందులో నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు