యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘పరదా’ ఆగస్టు 22న గ్రాండ్ రిలీజ్కు రెడీ అయింది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ సోషల్ డ్రామా చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దీనికి తోడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని సోషల్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అనుపమ పోషించిన పాత్రకు ప్రేక్షకుల మంచి ప్రశంసలు దక్కుతాయని వారు తెలిపారు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్తో పాటు దర్శనా రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఆగస్టు 22న రిలీజ్ కానున్న ‘పరదా’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.