అంకుల్‌ అని పిలిచినా అంగీకరించాల్సిందే – మాధవన్‌

అంకుల్‌ అని పిలిచినా అంగీకరించాల్సిందే – మాధవన్‌

Published on Aug 18, 2025 1:59 PM IST

madhavan

హీరో మాధవన్‌ ‘ఆప్‌ జైసా కోయి’తో ప్రేక్షకులను పలకరించి అలరించారు. తాజాగా ఓ కార్యక్రమంలో వయసు గురించి మరోసారి మాట్లాడుతూ.. ‘మన పిల్లల స్నేహితులు మనల్ని అంకుల్‌ అని పిలిచినప్పుడు అందరికీ మొదటిసారి వయసు గుర్తొస్తుంది. వారిపై కోపం వస్తుంది. ఎంత ఆశ్చర్యపోయినా ఆ పదాన్ని అందరూ అంగీకరించాల్సిందే. వయసు పెరుగుతున్నకొద్దీ సినిమాల్లో మన పక్కన నటించే హీరోయిన్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటూ మాధవన్‌ తెలిపారు.

మాధవన్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఇక నేను చూడడానికి ఎలా కనిపిస్తున్నప్పటికీ సినిమాల ఎంపిక విషయంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాను. ఆ అంశాల్లో నా వయసు కూడా ఉంది. ఐతే, ‘ఆప్‌ జైసా కోయి’ సినిమాను ప్రారంభించినప్పుడు నేను రొమాంటిక్‌ సినిమాల్లో నటించగలను అనే భావనలో ఉన్నాను, అందుకే ఈ వయసులోనూ ఆ కథను అంగీకరించినట్లు మాధవన్ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు