దర్శకుడిగా మారనున్న ప్రముఖ రచయిత

దర్శకుడిగా మారనున్న ప్రముఖ రచయిత

Published on Jun 12, 2013 2:30 AM IST

Kona-Venkat
ప్రముఖ రచయిత కోన వెంకట్ దర్శకుడిగా పరిచయం అవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది మొదట్లో ఒక పెద్ద నటుడితో కలిసి పంచేస్తాను అని చెప్పిన ఆయన దానికంటే ముందు ఒక లఘు చిత్రాన్ని తీసే పనిలో ఉన్నారు. దీని గురించి వివరణ ఇస్తూ భారతీయ నటులతో న్యూయార్క్ లో ఒక లఘు చిత్రాన్ని తీస్తున్నాను అని తెలిపారు. లాఫింగ్ బుద్దా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వంశీ మాదిరాజు మరియు రామ్ గోలి అనే ఎన్.ఆర్.ఐ లు ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాకుగానూ న్యూయార్క్, న్యూజెర్సీ లలో ఉన్న భారతీయ నటులను తీసుకోవడానికి యోచిస్తున్నారు. “న్యూయార్క్, న్యూజెర్సీ లలో ఉంటున్న తెలుగు మాట్లాడగలిగే భారతీయ నటుల కోసంచూస్తున్నాం. 20-30 ఏళ్ళ వయసువున్న ఆసక్తిగల యువతీయువకులు మీ ఫోటోను :[email protected] కు పమపమని” కోనా వెంకట్ ట్విట్టర్లో తెలిపాడు

తాజా వార్తలు