మా నెక్స్ట్ చిత్రం ‘సలార్ 2’.. వాటితో పాటు మరో రెండు – హొంబలే ఫిల్మ్స్

మా నెక్స్ట్ చిత్రం ‘సలార్ 2’.. వాటితో పాటు మరో రెండు – హొంబలే ఫిల్మ్స్

Published on Aug 9, 2025 8:00 AM IST

ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ హొంబలే ఫిల్మ్స్ పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసింది. కేజీయఫ్, కేజీయఫ్ 2, కాంతార, సలార్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ వచ్చింది ఈ బ్యానర్ నుండే. ఇక ఇటీవల ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేషన్ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను మేకర్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మేకర్స్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. తమ బ్యానర్ హొంబలే ఫిల్మ్స్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా ‘సలార్ 2’ అని.. ఆ తర్వాత ప్రభాస్‌తో మరో రెండు సినిమాలు ఉన్నాయని నిర్మాతలు తెలిపారు.

ఇలా సలార్ 2 చిత్రంపై మేకర్స్ నుంచి మరోసారి క్లారిటీ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు