షాకింగ్ వసూళ్లతో రికార్డులు తిరగరాసిన ‘మహావతార్ నరసింహ’

షాకింగ్ వసూళ్లతో రికార్డులు తిరగరాసిన ‘మహావతార్ నరసింహ’

Published on Aug 2, 2025 1:00 PM IST

ఎలాంటి తారాగణం లేకుండానే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తున్న యానిమేషన్ చిత్రమే “మహావతార్ నరసింహ”. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం పిల్లలు నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ఆడియెన్స్ ని అలరించి భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇలా మొత్తం 8 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర రికార్డులు తిరగరాసినట్టు మేకర్స్ చెబుతున్నారు.

ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన అన్ని యానినేషన్ సినిమాల తాలూకా వసూళ్ల రికార్డులు ఈ సినిమా 8 రోజుల్లో 60 కోట్లకి పైగా గ్రాస్ తో క్రాస్ చేసినట్టు తెలిపారు. దీనితో ఈ డివైన్ బ్లాక్ బస్టర్ ఒక షాకింగ్ రన్ ని ఇప్పుడు కొనసాగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ అదే స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి.

తాజా వార్తలు