పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు ఎన్నో నెలల తరబడి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది తమిళ నటుడు శింబుతో పాడించిన ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్ అని చెప్పాలి.
ఎప్పుడు నుంచో కాపాడుకుంటూ వస్తున్న భారీ హైప్ ఉన్న ఈ సాంగ్ లీక్ అయ్యింది అని సంగీత దర్శకుడు థమన్ సుజీత్ కి ఒక్కసారిగా షాకిచ్చాడు. ఇది వరకు పలు భారీ సినిమాల సాంగ్స్ ఇలానే లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓజి సాంగ్ కూడా లీక్ అయ్యినట్టు థమన్ సుజీత్ కి కాల్ చేసి చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే నిజంగా సాంగ్ లీక్ అయ్యిందా అంటే లేదు. సాంగ్ రిలీజ్ కి ముందు సుజీత్ తో థమన్ మినీ సస్పెన్స్ సినిమానే చూపించాడు. కాల్ చేసి సాంగ్ లీక్ అయ్యిందని ఎలా అయ్యిందో తెలీదు అంటూ చెప్పడం దానికి సుజీత్ రియాక్షన్ లు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. అయితే చివరగా సాంగ్ లీక్ ఏమీ లేదని జస్ట్ ప్రాంక్ గా చేసానని చెప్పేసాడు. ఇలా సాంగ్ రిలీజ్ కి ముందు ఇలాంటి ప్రమోషన్ ని ప్లాన్ చేయడంతో అభిమానులు ఈ సాంగ్ కోసం మరింత ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.
Our @MusicThaman prank call to Sujeeth ????#TheyCallHimOG
— TheyCallHimOG (@TheOGBookings) August 1, 2025