నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో

నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో

Published on Aug 1, 2025 3:07 PM IST

mahavatara-narasimha

అసలు ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా ఒక యానిమేషన్ సినిమా ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపుతుంది. మరి ఆ చిత్రమే “మహావతార్ నరసింహ”. దర్శకుడు అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఒక ఊహించని బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. తెలుగు, హిందీ భాషల్లో ఈ యానిమేషన్ సినిమా భారీ వసూళ్లు అందుకుంటుంది.

ఇక నార్త్ లో అయితే వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ అదే నిలకడతో దూసుకెళ్తుండడం విశేషం. సోమవారం నుంచి నిన్న గురువారం వరకు కూడా ఒకో రోజుకి గ్రాఫ్ పెరుగుతూనే వెళ్ళింది తప్పితే ఈ చిత్రం ఎక్కడా తగ్గింది లేదు. ఇలా 3.8 కోట్ల నెట్ వసూళ్లు నుంచి నిన్న గురువారానికి 5.9 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని ఈ చిత్రం సొంతం చేసుకోవడం విశేషం.

దీనితో మొత్తం 32.8 కోట్ల నెట్ వసూళ్లు ఒక్క హిందీ వెర్షన్ లోనే ఈ సినిమా రాబట్టడం అనేది సెన్సేషన్ అని చెప్పాలి. ఇక వీక్ డేస్ లోనే ఇలా ఉంటే నేడు రేపు వీకెండ్ హాలిడేస్ ఏ లెవెల్లో ఉంటాయో కూడా అర్ధం చేసుకోవచ్చు. సో ఈ రెండు రోజుల్లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు రాబడుతుంది అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు