‘కింగ్డమ్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే..?

‘కింగ్డమ్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే..?

Published on Jul 31, 2025 5:00 PM IST

Kingdom

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్‌ను కూడా లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను 4 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఆగస్టు నెలాఖరు వరకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించగా సత్యదేవ్ మరో కీలక పాత్రలో నటించాడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు