దాసరి ఇంట్లో సీబీఐ సోదాలు

దాసరి ఇంట్లో సీబీఐ సోదాలు

Published on Jun 11, 2013 1:19 PM IST

Dasari-Narayana-Rao

కేంద్ర మాజీ మంత్రి డా. దాసరి నారాయణ రావు గారి ఇంట్లో ఈ రోజు సీబీఐ సోదాలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన బొగ్గు గనుల స్కాంలో ఆయనను అనుమానిస్తూ ఈ సోదాలను నిర్వహించారు. కొన్ని నెలలకు ముందు ఈ విషయంపై దాసరిని కలిసిన సీబీఐ నిన్న ఆయన పేరు ను ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చినట్లు తెలుయజేసింది సిబిఐ. డా. దాసరి నారాయణ రావు గారు 2004 – 2008 మద్య కాలంలో బొగ్గు గనుల సహాయ మంత్రిగా ఉన్నారు. అలాగే ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ నవీన్ జిందాల్ పేరును కూడా సిబిఐ ఎఫ్.ఐ.ఆర్ లో నమోదు చేసింది.

రెండు సీబీఐ బృందాలు దాసరి నారాయణ రావు ఇంటికి వెళ్ళాయని ఒక బృందం ఆయన ఇంటిని మొత్తం సోదాలు నిర్వహించగా, మరోబృందం నవీన్ జిందాల్ సంస్థలకు బొగ్గు కేటాయింపుల గురించి దాసరి గారిని పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

తాజా వార్తలు