నితిన్ పక్కకు పెట్టిన సినిమాను స్టార్ట్ చేస్తున్న సందీప్ కిషన్

నితిన్ పక్కకు పెట్టిన సినిమాను స్టార్ట్ చేస్తున్న సందీప్ కిషన్

Published on Jul 29, 2025 2:11 AM IST

యంగ్ హీరో నితిన్ గతంలో ‘పవర్ పేట’ అనే సినిమాను చేయాల్సి ఉంది. లిరిసిస్ట్ నుంచి డైరెక్టర్‌గా మారిన కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ను పక్కకుపెట్టారు. ఇక కృష్ణ చైతన్య ఆ తర్వాత విశ్వక్ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాన్ని తెరకెక్కించాడు.

అయితే, ఇప్పుడు ఈ ‘పవర్ పేట’ తిరిగి పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోందట. కానీ, ఈసారి హీరోగా నితిన్ ప్లేస్‌లో మరో హీరో సందీప్ కిషన్ సిద్ధమవుతున్నాడట. కథలో కొన్ని మార్పులు చేసిన కృష్ణ చైతన్య ఈసారి ఎలాగైనా ఈ సినిమా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో సందీప్ కిషన్‌తో ఈ సినిమాను చేసేందుకు ఆయన ప్లాన్ చేశాడు.

ఇక ఈ సినిమాను 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న ఘనంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు