ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

Published on Jul 27, 2025 6:55 PM IST

Mandala Murders Series Review

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 27, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : నెట్ ఫ్లిక్స్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్త, సుర్వీన్ చావ్లా, జమీల్ ఖాన్, శ్రియా పిల్గొంకర్ తదితరులు
దర్శకత్వం : గోపి పుత్రన్
సంగీతం : సంచిత్ బాళ్హరా, అంకిత్ బాళ్హరా
సినిమాటోగ్రఫీ : షాజ్ మొహమ్మద్
ఎడిటింగ్ : మిథేష్ సోని

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ కి తీసుకొచ్చిన సిరీస్ లలో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి నటి వాణి కపూర్ ఓటిటి డెబ్యూ ఇచ్చిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘మండల మర్డర్స్’ కూడా ఒకటి. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 లో ఉత్తర భారతదేశం చరణ్ దాస్ పూర్ అనే గ్రామంకి చెందిన మంత్రగత్తె రుక్మిణి (శ్రియా పిల్గొంకర్) ఇంకొంతమంది మంతగత్తెలతో కలిసి వరుణ అడవిలో ఆయాస్తి పరికరం అనే ఒక దానితో తమ భగవంతుడు ఆయస్తిని పలు ప్రక్రియలతో పుట్టించి ఒక కొత్త లోకాన్ని సిద్ధం చేసుకోవాలని చూస్తారు. కానీ అది ఒక కారణం చేత విఫలం అవుతుంది. ఆ తర్వాత ప్రస్తుతానికి కాలం చేరాక విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్త) ఒక ఢిల్లీ పోలీస్ కాగా సి ఐ బి ఆఫీసర్ రియా థామస్ (వాని కపూర్) తో కలిసి ఒక దారుణమైన పొలిటికల్ మర్డర్ కేసులో లింక్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ నుంచి మరిన్ని వినూత్న విధానంలో పలు మర్డర్స్ జరుగుతాయి. అలాగే చరణ్ దాస్ ప్రాంతంలో పొలిటికల్ గా బలంగా నిలబడాలి అని చూసే అనన్య భరద్వాజ్ (సుర్వీన్ చావ్లా) ఏం చేస్తుంది? ఈ మొత్తానికి ఎలా లింక్ అయ్యి ఉంది? రియాకి కూడా ఉన్న గతం ఏంటి? ఆ ఆయస్తి పరికరంలో బొటనివేలు పెట్టి కోరిన కోరికలు నెరవేరడం ఏంటి? చివరికి ఆ ఆయస్తి దేవుడు వచ్చాడా లేదా? ఇలా ప్రతీ ఒక్కరి వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి కారణాలు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ ని మేకర్స్ మహేంద్ర జాకర్ రచించిన పుస్తకం ది బుచర్ ఆఫ్ బెనారస్ ఆధారంగా తెరకెక్కించారు. ఏదో సాదా సీదాగా ఓ మర్డర్ థ్రిల్లర్ ని చూద్దాం అనుకునేవారు ఈ సిరీస్ ని పెట్టుకుంటే డెఫినెట్ గా థ్రిల్ చేసి తీరుతుంది అని చెప్పవచ్చు. ఒకో మనిషి నుంచి భాగాలు వేరు చేసి ఇంకొక దేహాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి దేవునిగా మార్చడం అనే పాయింట్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ఇది వరకు పలు సూపర్ నాచురల్ థ్రిల్లర్ తరహా సిరీస్ లు లేదా సినిమాలు వచ్చి ఉన్నప్పటికీ ఇందులో కనిపించే నేపథ్యం చాలా ఆసక్తి రేకెత్తిస్తుంది. పైగా సైన్స్ ఫిక్షన్ కి జోడించడం ఇంకో పక్క మర్డర్ మిస్టరీలు దిశగా సాగే ఇన్వెస్టిగేషన్ వాటికి అల్లుకొని ఒకో చిక్కుముడి విప్పుతూ వెళ్లడం అనేది చూసే ఆడియెన్ ని ఎంగేజ్ చేస్తూ అలా తీసుకెళ్తుంది.

మామూలుగా కొన్ని సిరీస్ లలో కథనం వెళుతున్న కొద్దీ కొత్త పాత్రలు పరిచయం కావడం వాటికి బ్యాక్ స్టోరీ లాంటివి బోర్ కొట్టేస్తాయి కానీ ఇందులో అలా లేదు. ప్రతీ పాత్రకి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీతో కథనం నడపడం మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. దాదాపు అన్ని ఎపిసోడ్స్ లో కూడా ఈ మూమెంటం సాగుతుంది. ఇక వీటితో పాటుగా నటీనటులు అంతా సిరీస్ లో బాగా చేశారు.

విక్రమ్ సింగ్ గా వైభవ్ చాలా బాగా చేసాడు. రానా నాయుడు నటి సుర్వీన్ చావ్లా పాత్ర మొదట్లో సింపుల్ గానే అనిపిస్తుంది కానీ తర్వాత ఆమె రోల్ పై ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తుంది. ఇదే తరహాలో నటి వాణి కపూర్ రోల్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. తనకిది డెబ్యూ సిరీస్ కాగా ఈమె మంచి రోల్ లో చేసింది అందులో ఫిట్ అయ్యింది. తనపై యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. వీరితో పాటుగా మీర్జాపూర్ ఫేమ్ నటి శ్రియ కనిపించింది కొంతసేపే అయినప్పటికీ సాలిడ్ రోల్ ని ఆమె చేసింది. వీరితో పాటుగా ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే సహాయక పాత్రలో నటుడు జమీల్ ఖాన్ మంచి నటన కనబరిచారు. వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం సోసోగా అనిపిస్తాయి. లాజికల్ గా ఆలోచిస్తే ఇలాంటివి బయట జరిగే అవకాశం ఉందా అంటే లేదనే అనుకోవచ్చు. సో లాజిక్ లాంటివి ఈ సిరీస్ లో పక్కన పెట్టెయ్యాలి. 24 సినిమాలో టైం ట్రావెల్ వాచ్ ని ఎలా తయారు చేసారు అనే ప్రశ్న వస్తే ఎలా ఉంటుందో ఇందులో కూడా సైన్స్ ఫిక్షన్ లాంటి అంశాల్లో డౌట్స్ రావచ్చు.

అప్పటి వరకు దర్శకుడు మంచి వివరణ ఇచ్చే ప్రయత్నమే చేశారు. అలాగే మొదటి కొన్ని ఎపిసోడ్స్ వరకు ఇది వరకు వచ్చిన విరూపాక్ష, అరుంధతి లాంటి సినిమాలు గుర్తు వస్తాయి. కానీ తర్వాత ఈ అనుమానాలు పటాపంచలు అవుతాయి. అలాగే దీనిని ఒక హారర్ తరహా సిరీస్ అనుకున్నా డిజప్పాయింట్ అవుతారు.

మంచి హారర్ మూమెంట్స్ ఏమి ఇందులో ఉండవు. ఇది కేవలం ఒక హత్యలు, అతీంద్ర శక్తులుతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్ మాత్రమే. ఓ ఈ అంశాలు గుర్తుంచుకోవాలి. అలాగే స్టార్టింగ్ లో కథనం కొంచెం నెమ్మదిగా సాగింది. ఈ అంశాలు సినిమాలో కొంచెం అటు ఇటుగా అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అందించారు. నేపథ్యానికి తగ్గట్టుగా క్రియేట్ చేసుకున్న ప్రపంచం తాలూకా సెటప్ అంతా సిరీస్ లో చాలా బాగుంది. నటీనటులకు ప్రొస్థెటిక్ మేకప్ వంటివి బాగా చేశారు. సంగీతం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. పలు సన్నివేశాలకి బాగా ప్లస్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫి కూడా సిరీస్ లో ప్లస్ గా నిలిచింది. మంచి విజువల్స్ ని అందించారు. అలాగే ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉంది.

ఇక దర్శకుడు గోపి పుత్రన్ విషయానికి వస్తే.. తాను అడాప్ట్ చేసుకున్న అంశాన్ని బాగా హ్యాండిల్ చేసారని చెప్పవచ్చు. మధ్యలో వచ్చే కాలమానాలు పెద్దగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది. ప్రతీ పాత్రని డీటెయిల్డ్ గా డిజైన్ చేసి తెరకెక్కించిన విధానం బాగుంది. అలాగే థ్రిల్ అండ్ సస్పెన్స్ అంశాలని బాగా మైంటైన్ చేస్తూ తీసుకొచ్చారు. ఓవరాల్ గా తన వర్క్ మాత్రం ఈ సిరీస్ కి చాలా బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ “మండల మర్డర్స్” సిరీస్ కేవలం ఒక మర్డర్ మిస్టరీ సిరీస్ మాత్రమే కాదు ఇందులో ఇంట్రెస్టింగ్ గా సాగే సూపర్ నాచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అలాగే ఫాంటసీ అంశాలు ఎలాంటి అంచనాలు లేకుండా చూసే ఆడియెన్స్ ని బాగా థ్రిల్ చేస్తాయి. దర్శకుడు కథనాన్ని తీసుకెళ్లిన విధానం కానీ సిరీస్ లో కనిపించే ఒకో మర్డర్ ప్రక్రియ దాని వెనుక ఉన్న కారణాలు ఈ తరహా సిరీస్ లవర్స్ కి మంచి ట్రీట్ అందిస్తాయి. ఒక కొత్త రకం సస్పెన్స్ అండ్ సూపర్ నాచురల్ అంశాలతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు తెలుగు డబ్బింగ్ లో కూడా ఉన్న ఈ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ లో ట్రై చెయ్యండి.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు