“సంథింగ్…సంథింగ్ ఒక ఫీల్ గుడ్ సినిమా”- సుందర్ సి

“సంథింగ్…సంథింగ్ ఒక ఫీల్ గుడ్ సినిమా”- సుందర్ సి

Published on Jun 10, 2013 11:50 PM IST

Sunder-C
సిద్ధార్థ్, హన్సిక నటిస్తున్న ‘సంథింగ్…సంథింగ్’ సినిమా జూన్ 14న విడుదలకు సిద్దంగావుంది. తమిళంలో 20 సినిమాలకు పైగా తీసిన సుందర్ సి ఇప్పుడు తెలుగలో తన మొదటి సినిమాతో మనముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో భారీ రీతిలో విడుదలకానుంది. లవ్ గురు బ్రహ్మానందం సహాయంతో హన్సిక ను ప్రేమించడానికి ప్రయత్నించే పాత్రలో సిద్ధార్ధ్ కనిపిస్తాడు. ఈ ‘సంథింగ్…సంథింగ్’ సినిమా కామెడి చిత్రం కాదని దర్శకుడు అన్నాడు. “ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమా కాదు. అంతర్లీనంగా కామెడి ఇమిడి వుంటుంది. బ్రహ్మానందం సహాయంతో హన్సిక ప్రేమని సిద్ధార్ద్ పొందే సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయి. న మొదటి తెలుగు సినిమా ఇది కావడం నా అదృష్టం ” అని అన్నాడు. తెలుగు వెర్షన్ ను లక్ష్మి గణపతి ఫిల్మ్స్ ద్వారా విడుదలవుతుంది. సత్య సంగీతం అందించాడు.

తాజా వార్తలు