మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను VT15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. పూర్తి హార్రర్ డ్రామా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర సరికొత్తగా ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ శరవేగంగా జరుగుతున్నాయని.. దీనిలో భాగంగా హీరో వరుణ్ తేజ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కలిసి ఉన్న ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం థమన్ ఓ అదిరిపోయే ఆల్బమ్ ఇస్తున్నాడని.. త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు ఇది సిద్ధమవుతోందని వారు తెలిపారు.
ఇక ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా కమెడియన్ సత్య మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.