బాలకృష్ణ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్

బాలకృష్ణ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్

Published on Jun 10, 2013 1:45 PM IST

Balakrishna_New_Film (3)

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా పని మొదలు పెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అభిమానుల్లో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అనేది సస్పెన్స్ గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ ఎంపికయ్యాడని ఫిల్మ్ నగర్లో వినిపించినా అది అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ రోజుతో ఆ సస్పెన్స్ కి తెరపడింది. ఈ రోజు జరిగిన ఈ సినిమా ముహూర్త కార్యక్రమంలో దేవీశ్రీ ప్రసాద్ సందడి చేసాడు.

బాలకృష్ణ సినిమాలో ఎక్కువగా బీట్స్ తో కూడిన మాస్ సాంగ్స్ ఉంటాయి. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేస్తాడా అనేది ఆసక్తి కరంగా మారింది. చాలా గ్రాండ్ గా జరిగిన ముహూర్త కార్యక్రమానికి భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు.

ఈ ముహూర్త కార్యక్రమంలో బాలయ్య ‘ కొందరు ఆశించడానికే పుడతారు.. కొందరు శాసించడానికే పుడతారు’ అనే డైలాగ్ ని చెప్పారు.

తాజా వార్తలు