సెన్సార్ పనులు ముగించుకున్న ‘హరిహర వీరమల్లు’.. అల్టిమేట్ యాక్షన్‌కు సిద్ధం!

సెన్సార్ పనులు ముగించుకున్న ‘హరిహర వీరమల్లు’.. అల్టిమేట్ యాక్షన్‌కు సిద్ధం!

Published on Jul 14, 2025 5:02 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ హిస్టారికల్ ఎపిక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులోని అల్టిమేట్ యాక్షన్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చుతుందని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్, కథ, వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను మైమరపించేలా ఉంటాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 24న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు