యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు జైన్స్ నాని డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా, ఈ సినిమా గ్లింప్స్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్ అంశాలతో కట్ చేశారు. పక్కా ఊరనాటు పాత్రలో కిరణ్ అబ్బవరం నటిస్తున్నాడు. మాస్ భాషలో చెప్పాలంటే పక్కా ‘చిల్లర’ గాడు ఎలా ఉంటాడో అలాంటి పాత్రను కిరణ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన రిచెస్ట్ చిల్లరగాడిలా కనిపిస్తూ సందడి చేయబోతున్నాడు. ఆయన నోటి నుంచి వచ్చే డైలాగులు కూడా అదే విధంగా ఉన్నాయి.
ఈ చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, కిరణ్ అబ్బవరం సరికొత్త లుక్స్‌తో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి