ఓటీటీలోకి ఒక రోజు ముందుగానే వచ్చేసిన ‘నరివెట్ట’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఓటీటీలోకి ఒక రోజు ముందుగానే వచ్చేసిన ‘నరివెట్ట’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Published on Jul 11, 2025 12:00 AM IST

మలయాళ హీరో టొవినో థామస్ నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా ‘నరివెట్ట’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయింది. ఇక టొవినో థామస్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

అయితే, జూలై 11న ఈ చిత్రాన్ని సోనీ లివ్‌లో స్ట్రీమిగంగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, అభిమానులకు షాకిస్తూ ఈ సినిమాను ఒక రోజు ముందుగానే జూలై 10న ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు. దీంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

ఈ సినిమాలో సూరజ్ వెంజారమూడు, ఆర్య సలిం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా కంపెనీ బ్యానర్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు