ఆడియన్స్ కి మత్తెక్కించడానికి సిద్దమైన అమీ జాక్సన్

ఆడియన్స్ కి మత్తెక్కించడానికి సిద్దమైన అమీ జాక్సన్

Published on Jun 9, 2013 6:24 PM IST

Amy-Jackson

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ద్వారా అమీ జాక్సన్ తెలుగు వారికి పరిచయం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అమీ జాక్సన్ అల్ట్రా గ్లామరస్ పాత్రలో కనిపించనుంది. శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే రామ్ చరణ్ – అమీ జాక్సన్ పై థాయ్ ల్యాండ్ లో ఓ పాటని చిత్రీకరించారు. బీచ్ లో తీసిన ఈ పాటలో అమీ జాక్సన్ టూ పీస్ బికినీ వేసి తన అందాలతో తెలుగు ప్రేక్షకులకి మత్తెక్కించనుందని సమాచారం.

గత నెలలో రామ్ చరణ్ – అమీ జాక్సన్ లపై స్విట్జర్ ల్యాండ్లో మరో పాటని షూట్ చేసారు. ఇప్పటి వరకూ అందరి దగ్గరి నుంచి వచ్చిన కథనం ప్రకారం ‘ఎవడు’ లో అమీ జాక్సన్ తన గ్లామరస్ పాత్రతో తెలుగు ఆడియన్స్ ని మైమరిపించనుంది. ఎవడు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భామ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో విక్రమ్ హీరోగా చేస్తున్న ‘మనోహరుడు’ సినిమా షూటింగ్లో బిజీ గా ఉంది. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాని జూలైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడిగా, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు