ఆఫీషియల్ : కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘కింగ్డమ్’.. ప్రోమో అదిరింది!

ఆఫీషియల్ : కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘కింగ్డమ్’.. ప్రోమో అదిరింది!

Published on Jul 7, 2025 7:13 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కింగ్డమ్’ నుంచి మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చేసారు. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రానికి సరికొత్త రిలీజ్ డేట్ ను ఓ ప్రోమో ద్వారా అనౌన్స్ చేశారు.

ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాను జూలై 31న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఈ రిలీజ్ డేట్ ప్రోమోను ప్యూర్ యాక్షన్ కట్ గా వదిలారు. హరి హర వీరమల్లు తర్వాత వారం గ్యాప్ తో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. దీంతో తమ సినిమాకు కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తుండగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు