గోవా నుండి సౌత్ కి పరిచయమైన అందాల భామ ఇలియానా వరుసగా ఆరేళ్ళ పాటు సౌత్ లో పలు భాషల్లో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా నిలిచింది. ‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్ కి వెళ్లి హిట్ అందుకొని అక్కడే సెటిల్ అయిపొయింది. ఈ మధ్య కాలంలో సౌత్ వైపు అసలు చూడని ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. ఎవరైనా హీరోయిన్ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సరైన అవకాశాలు రాకపోతే నిరాశ చెందడం తప్పనిసరి. కానీ మన గోవా బ్యూటీ ఇలియానా మాత్రం అవకాశాలు రాకపోయినా అసలు భాదపడను అంటోంది.
ఆ విషేషాలేంటో ఇలియానా మాటల్లోనే ‘నేను సౌత్ లో ఆరేళ్ళ పాటు బ్రేక్ లేకుండా సినిమాలు చేసాను. ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి పెట్టాను. అలా అని ఇక్కడ ఆఫర్లు రాకపోతే భాదపడుతూ కూర్చోవల్సిన పనిలేదు. నేను సౌత్ లో సినిమాలు చేయనంత మాత్రానా నా ప్లేస్ ఖాళీ అయినట్టు కాదని’ ఇలియానా చెబుతోంది.