మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. అయితే ఈ చిత్రం ట్రైలర్ సహా పాటలు మంచి ఆదరణ అందుకోగా ఈ జూలై మొదటి వారంలో రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.
మరి రేపు జూన్ 30 న సాయంత్రం రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేసేసారు. వైబ్ ఆఫ్ తమ్ముడు అంటూ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ట్రైలర్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా దిల్ రాజును- శిరీష్ లు నిర్మాణం వహించారు. అలాగే ఈ జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.