‘తమ్ముడు’లో పవర్ స్టార్ రిఫరెన్స్.. కుండబద్దలు కొట్టిన హీరోయిన్!

‘తమ్ముడు’లో పవర్ స్టార్ రిఫరెన్స్.. కుండబద్దలు కొట్టిన హీరోయిన్!

Published on Jun 26, 2025 2:05 AM IST

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ షూటింగ్ పనులు ముగించుకుని జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా పూర్తి ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. ఇక ఈ సినిమాకు ‘తమ్ముడు’ అనే టైటిల్‌తోనే ఈ మూవీపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తీసుకున్నారని అభిమానులు అనుకుంటున్నారు. అంతేగాక, పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నితిన్ ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా పవన్‌కు సంబంధించి ఏదైనా రిఫరెన్స్ పెట్టి ఉంటాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

అయితే, ఈ మూవీలో పవన్ రిఫరెన్స్ లాంటిది ఏమీ లేదని నటి లయ తేల్చి చెప్పింది. ఈ సినిమాలో నితిన్ సోదరిగా లయ మనకు కనిపిస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా లయ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేసింది. కేవలం టైటిల్ వరకు పవన్ సినిమా రిఫరెన్స్ తీసుకున్నారని.. ఈ సినిమాలో పవన్‌కు సంబంధించి ఎలాంటి రిఫరెన్స్ లేదని ఆమె తెలిపింది.

దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు