‘కూలీ’ తెలుగు రైట్స్ @ రూ.48 కోట్లు.. లోకేశా మజాకా..!

‘కూలీ’ తెలుగు రైట్స్ @ రూ.48 కోట్లు.. లోకేశా మజాకా..!

Published on Jun 25, 2025 1:12 AM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ పై ప్రేక్షకుల్లో ఎలాంటి సాలిడ్ బజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై సాలిడ్ బజ్ ఏర్పడింది. లోకేశ్ గత చిత్రాల రికార్డులు కూడా ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావడానికి కారణమయ్యాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్ కూడా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొద్ది రోజులు ఈ చిత్ర తెలుగు రైట్స్ కోసం పలువురు స్టార్ ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారు. దీంతో ఈ మూవీ తెలుగు రైట్స్ ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, తాజాగా ఈ చిత్ర తెలుగు రైట్స్ ఏకంగా రూ.48 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారట.

తమిళ చిత్ర తెలుగు రైట్స్ అందుకున్న రెండో హయ్యెస్ట్ చిత్రంగా ‘కూలీ’ నిలిచింది. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్ తదితరులు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు