ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “జన నాయకుడు” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి విజయ్ బర్త్ డే కానుకగా ఇచ్చిన ట్రీట్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ గా మారింది. ఇక తనకి అనేకమంది సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపగా వీరి అందరికీ మించి ఇపుడు లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ త్రిష ఇచ్చిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇద్దరూ కలిసి కూర్చొని విజయ్ ఓ కుక్క పిల్లని ఎత్తుకొని కనిపిస్తున్నాడు. అలాగే మరి దీనికి త్రిష హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ అంటూ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక వీరి కలయికలో రీసెంట్ గానే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గానే త్రిష థగ్ లైఫ్ లో కూడా ఆమె కనిపించింది.