‘పూరి – విజయ్ సేతుపతి’ సినిమా పై కొత్త రూమర్ !

‘పూరి – విజయ్ సేతుపతి’ సినిమా పై కొత్త రూమర్ !

Published on Jun 22, 2025 6:00 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత తన కొత్త సినిమా బెగ్గర్ ని విజయ్‌ సేతుపతి హీరోగా పూరి ప్రకటించాడు.
ఇప్ప‌టి వ‌ర‌కూ పూరి నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందనట. తాజాగా ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్ దత్ కనిపిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కూ పూరి రాసిన స్క్రిప్ట్ లు అన్నింటికీ ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట.

అన్నట్టు విజయ్ సేతుపతి పాత్రలో మూడు కోణాలు ఉంటాయట. మొత్తానికి పూరి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు