‘తమ్ముడు’ నెక్స్ట్ సాంగ్ కి డేట్, టైం ఫిక్స్!

‘తమ్ముడు’ నెక్స్ట్ సాంగ్ కి డేట్, టైం ఫిక్స్!

Published on Jun 22, 2025 5:00 PM IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సహా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఈ చిత్రం నుంచి మేకర్స్ నెక్స్ట్ సాంగ్ కోసం అప్డేట్ ఇచ్చేసారు మేకర్స్.

జై బగళాముఖీ అంటూ సాగే పవర్ఫుల్ సాంగ్ ని ఈ జూన్ 24 న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఆ రోజున సాయంత్రం 5 గంటలకి విడుదల చేస్తున్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా తాను ఇచ్చిన స్కోర్ సహా పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రెండో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. మరి దిల్ రాజు – శిరీష్ లు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ జూలై 4న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు