ఎన్టీఆర్ X నెల్సన్.. బ్లాస్టింగ్ కాంబినేషన్ పై నిర్మాత నుంచి క్లారిటీ?

ఎన్టీఆర్ X నెల్సన్.. బ్లాస్టింగ్ కాంబినేషన్ పై నిర్మాత నుంచి క్లారిటీ?

Published on Jun 21, 2025 3:59 PM IST

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా సహా సాలిడ్ పాత్రలో చేస్తున్న సినిమాలు కోసం అందరికీ తెలిసిందే. తన బాలీవుడ్ ఎంట్రీ వార్ 2 చిత్రం గ్రాండ్ గా మరికొన్ని నెలల్లో విడుదల కాబోతుండగా ఇప్పుడు సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత దేవర 2 అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా తాను లాక్ చేసుకొని సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ చిత్రాల్లో మరో క్రేజీ కాంబినేషన్ కూడా ఉంది. అదే కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా దీనిపై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ఎక్స్ పోస్ట్ ఆసక్తిగా మారింది.

నెల్సన్ కి బర్త్ డే విష్ చేస్తున్న పోస్ట్ లో తమ డియరెస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కి అంటూ అతి త్వరలోనే బిగ్ స్క్రీన్ ట్రీట్ మళ్ళీ వెనక్కి రాబోతుంది అన్నట్టుగా చేసిన పోస్ట్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఆ బిగ్ అప్డేట్ ఏదో ఇలా హింట్స్ లా కాకుండా స్ట్రైట్ ఇచ్చేస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు