హమ్మయ్య.. ‘ఓజి’కి లైన్ క్లియర్!

హమ్మయ్య.. ‘ఓజి’కి లైన్ క్లియర్!

Published on Jun 21, 2025 9:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం పవన్ కెరీర్లోనే పీక్ హైప్ లో ఉంది. ఇక గత ఏడాది లోనే విడుదల కావాల్సిన ఈ సినిమాకి అక్కడ నుంచి సరిగ్గా మరో ఏడాది తర్వాత ఈ ఏడాదిలో వస్తుంది.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమా విడుదలకి పవన్ హరిహర వీరమల్లు సినిమా బ్రేక్ వేసేలా ఉందని ఈ సినిమా వచ్చే వరకు ఓజి పరిస్థితి ఏంటో అనేది అర్ధం కాదు అని టాక్ నడిచింది. ఇంకా ఆయితే ఓజి డేట్ లో వీరమల్లు వస్తుంది ఓజి మరో డేట్ కి వెళుతుంది అనేది కూడా వైరల్ అయ్యింది. కానీ ఫైనల్ గా మాత్రం హరిహర వీరమల్లు జూలై డేట్ ని అనౌన్స్ చేసుకోవడంతో ఓజి కి లైన్ క్లియర్ అయ్యినట్టే అని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో తాండవం చేస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు