తమిళ నటుడు విజయ్ ప్రముఖ డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదొస్ తో కలిసి పనిచెయ్యనున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరంలో ప్రారంభంకానుంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరొయిన్ గా సమంతను తీసుకోవడానికి హీరో మరియు డైరెక్టర్లు తెగ ఉవ్విల్లూరుతున్నారట. ఈ విషయం ఇంకా అధికారికంగా ఖరారుకాలేదు. నిజానికి తన చేతిలో చాలా ప్రాజెక్ట్లు ఉన్నాయని, ప్రస్తుత సినిమాలు పూర్తయ్యేవరకూ కొత్తవి అంగీకరించే టైం లేదని సమంత తెలిపింది.
ప్రస్తుతం ఈ భామ విక్రమ్ కుమార్ ‘మనం’లో, ఎన్.టి.ఆర్ సరసన ‘రామయ్యా వస్తావయ్యా’లో, పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో వస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటిస్తుంది. వీటి తరువాత లింగుస్వామి-సూర్యల సినిమాలో, ఎన్.టి.ఆర్ ‘రభస’లో నటించనుంది. విజయ్-మురుగదొస్ ల సినిమా వచ్చే యేడు మొదలుకావడంతో సమంత నిర్ణయం ఆసక్తికరంగా మారనుంది. ‘నాన్ ఈ’ మినహా ఆమె నటించిన ఏ తమిళ సినిమా విజం సాదించలేదు. కాని సూర్య, విజయ్ వంటి పెద్ద తారలతో నటిస్తే అక్కడ కూడా ఆమె దశ తిరిగినట్టే. సమంత ఏం నిర్ణయించుకుంటుందో చూద్దాం మరి