‘రాజమౌళి’ సినిమా పై మరో క్రేజీ గాసిప్ ?

‘రాజమౌళి’ సినిమా పై మరో క్రేజీ గాసిప్ ?

Published on Jun 15, 2025 8:01 AM IST

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ చేస్తున్న రోల్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరో పాత్ర నెగిటివ్ గా ఉంటుందని.. సెకండ్ హాఫ్ లో మాత్రం పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మొత్తానికే మహేష్ పాత్ర మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్‌ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు