నార్త్ లో ‘హరిహర వీరమల్లు’ కోసం సాలిడ్ ప్లాన్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సలహా

నార్త్ లో ‘హరిహర వీరమల్లు’ కోసం సాలిడ్ ప్లాన్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సలహా

Published on Jun 6, 2025 7:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ చిత్రమే “హరిహర వీరమల్లు”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఆన్ టైం రిలీజ్ కావడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. మరి ఈ చిత్రం కోసం ఎదురు చూపులు మరింత పెరుగుతుండగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకి కొన్నేళ్ల కితమే హిందీలో మంచి బజ్ ఏర్పడింది. వచ్చిన గ్లింప్స్ లు అవీ చూసి మంచి ఆఫర్స్ కూడా వచ్చాయని టాక్ ఉంది. అయితే లేటెస్ట్ గా ఫిల్మ్ ఫేర్ కథనం ప్రకారం బాలీవుడ్ టాప్ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్స్ లో ఒకరైన అనీల్ తడానీ హరిహర వీరమల్లు మేకర్స్ కి సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

తనకి సినిమా బాగా నచ్చింది అని అందుకే డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే హిందీలో కూడా మంచి పెర్ఫామ్ చేసే పొటెన్షియల్ ఈ సినిమాకి ఉంది కానీ తన సలహా మేరకు ఒక సాలిడ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేయాలని దానికి సినిమా రిలీజ్ కి మినిమమ్ రెండు వారాలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని చెప్పారట.

అలాగే ముంబైలో ఒక భారీ ఈవెంట్ ని ప్రమోషనల్ గా ప్లాన్ చేసుకుంటే మంచిది అని సినిమా కాన్సెప్ట్ డెఫినెట్ గా మంచి రీచ్ అందుకునే పొటెన్షియల్ ఉన్నది అని తెలిపారట. మొత్తానికి మాత్రం హరిహర వీరమల్లు నార్త్ లో కూడా పక్కాగా ప్లాన్ చేస్తే బాగానే రాణించే అవకాశం ఉందని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు