బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కించిన సాలిడ్ సౌత్ మార్క్ నార్త్ మాస్ మసాలా యాక్షన్ డ్రామా చిత్రం “జాట్”. హిందీ మార్కెట్ లో సన్నీ అండ్ మాస్ ఆడియెన్స్ కి మంచి ఫీస్ట్ ని అందించిన ఈ చిత్రం సన్నీ డియోల్ కెరీర్లో మరో మంచి హిట్ గా నిలిచింది.
అయితే గత ఏప్రిల్ లో థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు వరకు ఓటిటిలో మాత్రం రాలేదు. దీనితో ఓటిటి ఎంట్రీ కోసం చూస్తుం ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఈ డేట్ వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
మరి ఇందులో ఈ జూన్ 6 నుంచి కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులోకి రానున్నట్టుగా ఇపుడు ఖరారు అయ్యింది. సో ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు జస్ట్ ఈ కొన్ని రోజులు ఆగితే సరిపోతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.