పాతిక సినిమాల మార్కును త్వరలో పుర్తిచెయ్యనున్న ప్రముఖ డైరెక్టర్

పాతిక సినిమాల మార్కును త్వరలో పుర్తిచెయ్యనున్న ప్రముఖ డైరెక్టర్

Published on Jun 6, 2013 9:45 PM IST

Director-Vamsi
ప్రముఖ డైరెక్టర్ వంశీ యొక్క 25వ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమాలో అజ్మల్ అమీర్ మరియు నిఖిత నారాయణ్ లు ప్రధాన తారలు. ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్లో వుంది. క్లైమాక్స్ సన్నివేశాలను శంకరపల్లిలో తీస్తున్నారు. వచ్చేవారానికి ఈ సినిమా షూటింగ్ పుర్తికావచ్చు. నాయకానాయికల పాత్రలను అందంగా మరల్చగల దర్శకుడు వంశీ. ఈ సినిమా అందుకు మినహాయింపు కాదు. అందులోనూ ఇది అతనికి 25వ సినిమా కావడం మరింత ప్రత్యేకం. ఈ సినిమా టైటిల్ కు ‘తను మొన్నే వెళ్ళిపోయింది’ అనే పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. 80, 90లలో వంశీ ‘లేడీస్ టైలర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’ వంటి సినిమాలతో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం అదే కోవకు చెందిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. చక్రి సంగీత దర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

తాజా వార్తలు