సమంత రెండో పెళ్లి పై మళ్లీ రూమర్ !

సమంత రెండో పెళ్లి పై మళ్లీ రూమర్ !

Published on Jun 2, 2025 9:00 AM IST

సమంత రెండో పెళ్లి పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే. సమంత – నాగచైతన్య విడిపోయాక ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటుంది. అయితే, సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతుందని, తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సామ్, రాజ్ తో పికిల్ బాల్ ఆడుతూ కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్లకు మరింత బలం చేకూరింది.

ప్రస్తుతం సామ్- రాజ్ పికిల్ బాల్ ఆడుతోన్న వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. ఈ వీడియో పై రాజ్ నిడిమోరు భార్య శ్యామలి కూడా ఒక పోస్ట్ పెట్టింది.. ‘అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ఇప్పటికే వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని బలంగా టాక్ నడుస్తోంది. మరి నిజంగానే సామ్ – రాజ్ పెళ్లి చేసుకోబోతున్నారా ?, ఈ ప్రశ్నకు సామ్ మాత్రమే క్లారిటీ ఇవ్వగలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు