బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్ ఉన్నది ఉన్నట్టు చెబుతుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ సినిమాల గురించి, నటన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ అంటేనే మార్పుల మయం. పరిస్థితులకు తగ్గట్టు మార్పు సహజమే, అది అంగీకరించక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉండాలి. అప్పుడే, వారు లైమ్ లైట్ లో ఉంటారు. లేకపోతే ఫేడ్ అవుట్ అవుతారు అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం విద్యాబాలన్ రజనీకాంత్ సరసన నటిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.
అన్నట్టు విద్యాబాలన్ ఇంకా ఏం కామెంట్స్ చేసింది అంటే.. ‘నేను నా చిన్న తనంలో చాలా అల్లరి చేసేదాన్ని. ముఖ్యంగా నైట్ లు ఎక్కువగా మేల్కొనే దాన్ని. ఆ అలవాటు మానేయడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. నా జీవితాన్ని మార్చేసింది మాత్రం సినిమాలే. పెళ్లి తర్వాత కూడా నేను సినిమాలు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ విద్యాబాలన్ తెలిపింది.