‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి సాలిడ్ రెస్పాన్స్!

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి సాలిడ్ రెస్పాన్స్!

Published on May 15, 2025 8:03 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఆంధ్రా కింగ్ తాలూకా”. టైటిల్ అనౌన్సమెంట్ గ్లింప్స్ తోనే అదరగొట్టిన ఈ చిత్రంపై ఇపుడు మరింత మంచి బజ్ ఏర్పడింది.

మరి నేడు రామ్ పోతినేని బర్త్ డే కానుకగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ ఇపుడు అదరగొడుతుంది. ఆల్రెడీ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చేసి ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. మొత్తానికి మాత్రం రామ్ పోతినేని గట్టి కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలోనే సినిమా విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు