‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ పై సాలిడ్ రిపోర్ట్స్!

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ పై సాలిడ్ రిపోర్ట్స్!

Published on May 15, 2025 10:16 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఇపుడు సమయం దగ్గర పడుతుంది. దాదాపు జూన్ లోనే రిలీజ్ ఉంటుంది అనే టాక్ ఇపుడు స్ప్రెడ్ అవుతుండగా దీనితో పాటుగా ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ పై సాలిడ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే వీరమల్లు ట్రైలర్ అదిరింది అని తెలుస్తుంది. మేకర్స్ ఒక స్టన్నింగ్ ట్రైలర్ కట్ ని రెడీ చేశారట. విడుదల అయ్యాక డెఫినెట్ గా ఈ ట్రైలర్ అందరినీ మెప్పించే లెవెల్లో ఉంటుంది అని సాలిడ్ రిపోర్ట్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ ఇపుడు అంతా పాజిటివ్ గానే కనిపిస్తుంది. మరి చూడాలి ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు