గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక బాలయ్య కూడా ఈ సినిమాలో తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే, బాలయ్యకు ఓ తమిళ మాస్ డైరెక్టర్ కథను వినిపించాడని.. దీనికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు అధిక్ రవిచంద్రన్‌ను ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తారు.
కాగా, ఇప్పుడు అధిక్ రవిచంద్రన్ బాలయ్యకు ఓ స్టోరీ లైన్ వినిపించాడని.. దీనికి బాలయ్య ఓకే చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.