కోలీవుడ్ విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తన ఎవర్ గ్రీన్ దర్శకుడు మణిరత్నంతో చేస్తున్న భారీ చిత్రం “థగ్ లైఫ్” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాపై సాలిడ్ హైప్ ఆల్రెడీ నెలకొనగా ఈ చిత్రం కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి ఫస్ట్ సింగిల్ నుంచే కమల్ అండ్ టీం ప్రమోషన్స్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. మొదటి పాట నుంచే గట్టి ప్రమోషన్స్ ఈ సినిమాకి స్టార్ట్ కాగా మన తెలుగు ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ స్టార్ట్ చేసేసారు.
మరి ముఖ్యంగా కమల్ హాసన్ మాత్రం మామూలు డెడికేషన్ లో ఈ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని చెప్పాలి. తనతో ఉన్న కొందరు హీరోలు అయినా మారుతున్నారు కానీ కమల్ మాత్రం నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ లో కొనసాగుతున్నారు. మరి తన నుంచి ఈ రేంజ్ లో డెడికేషన్ అనేది సినిమా కోసం తాను పడుతున్న తపన ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఈ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.