పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా పూర్తి సైన్స్ ఫిక్షన్ మూవీగా అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
కాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాపై తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘కల్కి 2’ చిత్రం రిలీజ్ కావాలంటే 3-4 గ్రహాలు అనుకూలించాలని గతంలో చెప్పాను. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావాలంటే ఏకంగా 7-8 అనుకూలించాలి అని నాగ్ అశ్విన్ అన్నారు.
ఇక ఈ సీక్వెల్ చిత్రం పట్టాలెక్కాలంటే ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇక ‘కల్కి 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.