SSMB29లో డైనోసర్‌తో మహేష్ ఫైట్..?

SSMB29లో డైనోసర్‌తో మహేష్ ఫైట్..?

Published on Apr 23, 2025 7:03 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి SSMB29 ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా అడ్వెంచర్ కథగా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు చేసే అడ్వెంచర్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో జక్కన్న ఓ భారీ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నాడని.. ఇందులో మహేష్ బాబు ఏకంగా డైనోసర్‌తో ఫైట్ చేయబోతున్నాడట. గతంలో ఎన్టీఆర్‌ను ‘ఆర్ఆర్ఆర్’లో పులితో ఫైట్ చేయించాడు రాజమౌళి.

ఇక ఇప్పుడు మహేష్ బాబును డైనోసర్‌తో ఫైట్ చేయించనున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఈ సినిమాలోని అడవి నేపథ్యంలో సాగే షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు